ఆప్ఘన్ గురుద్వారలో చిక్కుకుపోయిన 200 మంది సిక్కులు

ABN , First Publish Date - 2021-08-16T22:28:39+05:30 IST

తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన ఆప్ఘనిస్థాన్‌లోని ఓ గురుద్వారలో 200 మందికి పైగా సిక్కులు చిక్కుకుపోయారని, వారితో పాటు ఆప్ఘనిస్థాన్‌లో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న..

ఆప్ఘన్ గురుద్వారలో చిక్కుకుపోయిన 200 మంది సిక్కులు

న్యూఢిల్లీ: తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన ఆప్ఘనిస్థాన్‌లోని ఓ గురుద్వారలో 200 మందికి పైగా సిక్కులు చిక్కుకుపోయారని, వారితో పాటు ఆప్ఘనిస్థాన్‌లో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న భారతీయులను తక్షణమే వెనక్కి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. అమెరికన్ మిలటరీ విమానంలోకి భయంతో చొచ్చుకుపోయిన అక్కడి ప్రజానీకాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు కాల్పులు జరిపాయన్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రికి కెప్టెన్ అమరీందర్ తాజా విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుని క్యూలు కట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే స్పందించిన అమరీందర్ సింగ్ కేంద్ర మంత్రికి విజ్ఞాపనలు చేయడంతో పాటు అక్కడి సిక్కులతో పాటు, భారతీయులను ఖాళీ చేయించి స్వదేశానికి రప్పించే విషయంలో చేతనైన సహాయాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాజా పరిణామాలపై అమరీందర్ ఆదివారంనాడు కూడా స్పందిస్తూ, జరుగుతున్న పరిణామాలు ఎంతమాత్రం మంచివి కావని, మన సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు. 

Updated Date - 2021-08-16T22:28:39+05:30 IST