పార్లమెంట్‌కు రోజుకు 200 మంది రైతులు: టికాయత్

ABN , First Publish Date - 2021-07-14T00:20:05+05:30 IST

ఈ నిరసనలో ప్రతిరోజు 200 మంది రైతులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆందోళనను ఆపే ప్రసక్తే లేదని, సాగు చట్టాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు తాము ఇంటికి వెళ్లేది కూడా లేదని టికాయత్ స్పష్టం చేశారు.

పార్లమెంట్‌కు రోజుకు 200 మంది రైతులు: టికాయత్

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు నూతన పంథా ఎంచుకున్నారు. ఇక నుంచి పార్లమెంట్ ముందు కూడా నిరసన చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సముఖంగా లేదని, అందుకే తాము ఇక నుంచి పార్లమెంట్ ఆవరణలో నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. జూలై 22 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపిన టికాయత్.. ఈ నిరసనలో ప్రతిరోజు 200 మంది రైతులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆందోళనను ఆపే ప్రసక్తే లేదని, సాగు చట్టాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు తాము ఇంటికి వెళ్లేది కూడా లేదని టికాయత్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-14T00:20:05+05:30 IST