న్యూఢిల్లీ : Jammu and Kashmirలోకి అక్రమంగా చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నారని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. శుక్రవారం ప్రారంభమైన నార్త్‌టెక్ సింపోజియం నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 21 మంది విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలు కూడా తగ్గినట్లు చెప్పారు. గడచిన పన్నెండు నెలల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఘటనలు చాలా తక్కువ అని తెలిపారు. సుమారు 3 సంఘటనలు మాత్రమే జరిగాయన్నారు. సరిహద్దుల ఆవల ఉగ్రవాద మౌలిక సదుపాయాలు యథాతథంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. భారీ ఉగ్రవాద శిబిరాలు 6 ఉన్నాయని, సాధారణ శిబిరాలు 29 ఉన్నాయని చెప్పారు.
మిలిటెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యథాతథంగా ఉండటానికి కారణం పాకిస్థాన్ సైన్యమేనని తెలిపారు. Pakistan Army, దాని ఏజెన్సీల ప్రమేయాన్ని నిరాకరించలేమని తెలిపారు. కశ్మీరు లోయలో దాదాపు 50 మంది స్థానిక ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని చెప్పారు. Radicalisationపై ఆందోళన వ్యక్తం చేస్తూ, యువతను Pakistan రాడికలైజ్ చేస్తోందన్నారు. రాడికలైజ్డ్ యువతకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, వారిని తిరిగి ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అధికరణ 370 రద్దు తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఈ మార్పు తేవడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 48 గుడ్‌విల్ స్కూల్స్‌లో దాదాపు 15,000 మంది విద్యార్థులు చదువుతున్నారని, భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోవడం గురించి వారికి బోధిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి