అతడికి 17.. ఆమెకు 20 ఏళ్లు.. ఫేస్‌బుక్‌లో చాటింగ్.. చివరకు ఇద్దరూ ఎంతకు తెగించారంటే..

ABN , First Publish Date - 2021-06-28T18:08:11+05:30 IST

ఆమెకు 20 ఏళ్ల వయసు. బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఫేస్‌బుక్‌లో 17 ఏళ్ల ఓ అబ్బాయితో స్నేహం మొదలు పెట్టింది. ఆ స్నేహం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. చివరకు

అతడికి 17.. ఆమెకు 20 ఏళ్లు.. ఫేస్‌బుక్‌లో చాటింగ్.. చివరకు ఇద్దరూ ఎంతకు తెగించారంటే..

ఆమెకు 20 ఏళ్ల వయసు. బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఫేస్‌బుక్‌లో 17 ఏళ్ల ఓ అబ్బాయితో స్నేహం మొదలు పెట్టింది. ఆ స్నేహం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. చివరకు ఇంట్లో వాళ్లను ఎదురించి ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఓ మైనర్ బాలుడిని ఓ యువతి పెళ్లాడిందన్న వార్త ఆ ఊళ్లో అందరికీ తెలియడంతో విషయం కాస్తా పోలీసులకు చేరింది. అంతే, వాళ్ల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న యువతిపైనే కాదు, ఆ పెళ్లికి హాజరయిన వాళ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడికి బెంగళూరు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి ఫేస్‌‌బుక్‌లో పరిచయం అయింది. ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రోజూ ఆ బాలుడితో ఆమె చాట్ చేసేది. వీడియో కాల్స్ మాట్లాడేది. ఈ క్రమంలోనే ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగింది. ఆ బాలుడు కూడా అప్పటికే ఆ యువతి మాయలో ఉండటంతో సరేనన్నాడు. ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా ఆ యువతి ఆ బాలుడి ఊరికి వచ్చింది. ఆ బాలుడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె అతడిని వెంటబెట్టుకుని ఓ గుడికి వెళ్లింది.


ఆ బాలుడికి సంబంధించిన కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ వార్త కాస్తా ఆ గ్రామంలో తెలిసింది. మైనర్ బాలుడిని ఓ యువతి పెళ్లాడిందన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ గ్రామానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘ప్రస్తుతం ఆ యువతిని అదుపులోకి తీసుకున్నాం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లిని జరిపించిన వారితోపాటు ఆ యువతిపై కూడా కేసును నమోదు చేశాం.’ అని పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2021-06-28T18:08:11+05:30 IST