బాలికపై లైంగిక దాడి.. యువకుడికి 20ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2021-03-27T12:21:16+05:30 IST

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి

బాలికపై లైంగిక దాడి.. యువకుడికి 20ఏళ్ల జైలు

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట : ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఖాజా కుమారుడు సయ్యద్‌ వాజిద్‌(18) 2018లో ఇంటి సమీపంలో ఉండే ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించినట్టు ఫలక్‌నుమా పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-27T12:21:16+05:30 IST