అందుబాటులో 20వేల టెస్టింట్‌ కిట్స్‌

ABN , First Publish Date - 2022-01-18T06:12:53+05:30 IST

జిల్లాలో 20 వేల కరోనా టెస్టింగ్‌ కిట్స్‌, మెడికల్‌ కిట్స్‌ ఆరోగ్య కేం ద్రాల్లో అందు బాటులో ఉన్నాయని డీఎంహెచ్‌వో కోటాచ లం తెలిపారు. మండల కేంద్రం లో స్థానిక పీహెచ్‌సీని ఆయన సోమవారం సందర్శిం చి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అందుబాటులో 20వేల టెస్టింట్‌ కిట్స్‌
గరిడేపల్లి పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో కోటాచలం

డీఎంహెచ్‌వో

గరిడేపల్లి, జనవరి 17 :  జిల్లాలో 20 వేల కరోనా టెస్టింగ్‌ కిట్స్‌, మెడికల్‌ కిట్స్‌ ఆరోగ్య కేం ద్రాల్లో అందు బాటులో ఉన్నాయని డీఎంహెచ్‌వో కోటాచ లం తెలిపారు. మండల కేంద్రం లో స్థానిక పీహెచ్‌సీని ఆయన సోమవారం సందర్శిం చి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమైక్రాన్‌ అంత ప్రమాదకారి కాదన్నారు. ప్రతి ఒక్కరూ  కొవిడ్‌ నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. ప్ర తి ఒక్కరూ నిర్లక్ష్యం వీడాలని; సామూహిక సమావేశాల కు, వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌లోని పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌, పంచాయతీ, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బంది బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలన్నారు. జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ 96.7శాతం పూర్తయ్యిందని; మిగిలిన 3.3 శాతం వ్యాక్సినేషన్‌ను త్వర లో పూర్తి చేస్తామన్నారు. రెండో డోసు 70శాతానికి పైగా వేశామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ వెంకట పాపిరెడ్డి, జిల్లా మీడియా అధికారి అంజయ్యగౌడ్‌, వైద్యాధికారి నరేష్‌, స్టాఫ్‌నర్స్‌ హైమావతి, సిబ్బంది ప్రమీల, అంజయ్య, సోములమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T06:12:53+05:30 IST