3 గంటల్లోనే 20 వేల శ్రీవారి లడ్డూలు విక్రయం

ABN , First Publish Date - 2020-05-26T10:13:34+05:30 IST

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు జిల్లా కేంద్రంలో సోమవారం విశేష స్పందన లభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ..

3 గంటల్లోనే 20 వేల శ్రీవారి లడ్డూలు విక్రయం

నేటికి 30 వేల లడ్డూలకు ఆర్డర్‌ పెట్టిన అధికారులు 


అనంతపురం టౌన్‌, మే 25: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు జిల్లా కేంద్రంలో సోమవారం విశేష స్పందన లభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తులకు శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని చేరువ చేసేందుకు టీటీడీ సంక ల్పించింది. ఆ మేరకు జిల్లాలకు పంపిన విషయం విదితమే. విక్రయాలు ప్రారంభించిన 3 గంటల్లోనే 20 వేల లడ్డూలు అమ్ముడుపోయాయి. తిరుమల నుంచి ఆదివారం రాత్రి టీటీడీ కల్యాణమండపానికి 20 వేల లడ్డూలు చేరుకోగా.. సోమవారం ఉదయం 7.30 నుంచి కల్యాణమండపం మేనేజర్‌ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విక్రయాలు చేపట్టారు. కార్యక్రమానికి టీటీడీ ఏఈఓ రాజేంద్రకుమార్‌ హాజరై లడ్డూ ప్రసాదం విక్రయాలను పర్యవేక్షించారు. శ్రీవారి ప్ర సాదం విక్రయాల విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దసంఖ్యలో కల్యాణమండపం వద్దకు చేరుకున్నారు. తొలుత రూ.25కి లడ్డూ చొప్పున ఒక్కో భక్తుడికి 5 నుంచి 10 ల డ్డూలు విక్రయించారు.


రద్దీ పెరగటంతో ఒకొక్కరికి 4 లడ్డూలు మాత్రమే విక్రయించారు. 3 గంటల్లోపే లడ్డూలు అయిపోవటంతో పలువురు నిరాశతో వెనుదిరిగారు. దీంతో మంగళవారం నిర్వహించనున్న లడ్డూప్రసాదం విక్రయాలకు ఆర్డర్‌ను పెంచారు. మొ త్తం 30 వేల లడ్డూలు మంగళవారం ఉదయం 9 గంటలకు కల్యాణమండపానికి చేరుకుంటాయన్నారు. ప్ర సాదాల విక్రయం సందర్భంగా భక్తులు భౌతికదూరం ని బంధనను విస్మరించారు. గుంపులు గుంపులుగా ఎగబడ్డా రు. పోలీసులు వచ్చి, భౌతికదూరం అమలయ్యేలా చూశా రు. కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ సిబ్బంది సోమశేఖర్‌, సుధామణి, శ్రీపాద వేణు, నాగేశఽ్వరి, శ్రీనివాసులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-26T10:13:34+05:30 IST