Abn logo
Feb 26 2021 @ 02:45AM

20% రిజర్వేషన్లు అమలు పరచాలి

మాదిగల జాగృతి రథయాత్రలో పిడమర్తి రవి


వికారాబాద్‌, ఫిబ్రవరి 25: అడగకుండానే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన కేంద్రం, అడిగిన మాదిగలకు 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంలేదని మాదిగ జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి విమర్శించారు. మాదిగల జాగృతి రథయాత్రలో భాగంగా గురువారం  వికారాబాద్‌లో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్‌ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీ, మైనార్టీలకు 10శాతం, బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
Advertisement