అనంతరాజుపేట కొవిడ్‌ కేంద్రానికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌

ABN , First Publish Date - 2021-05-17T04:57:54+05:30 IST

మండలంలోని అనంతరాజుపేట కొవిడ్‌ కేంద్రానికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు కొవిడ్‌ కేంద్రం నోడల్‌ అధికారి వీరన్న, వైసీపీ సీనియర్‌ నేత రామిరెడ్డి ధ్వజారెడ్డిలు తెలిపారు.

అనంతరాజుపేట కొవిడ్‌ కేంద్రానికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌
ప్రభుత్వం పంపిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందజేస్తున్న రామిరెడ్డి ధ్వజారెడ్డి

రైల్వేకోడూరు, మే 16: మండలంలోని అనంతరాజుపేట కొవిడ్‌ కేంద్రానికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు కొవిడ్‌ కేంద్రం నోడల్‌ అధికారి వీరన్న, వైసీపీ సీనియర్‌ నేత రామిరెడ్డి ధ్వజారెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి నియోజకవర్గ ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్ని వేళలా అండగా ఉంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే అనంతరాజుపేట కొవిడ్‌ కేంద్రానికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఏర్పాటు చేయించారన్నారు. కొవిడ్‌ కేంద్రానికి మిధున్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు మరో వంద పడకలు, ఆక్సిజన్‌, అన్ని రకాల మందులు ఏర్పాటు చేయిస్తారని తెలిపారన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.



 


Updated Date - 2021-05-17T04:57:54+05:30 IST