20 లక్షల ప్రభుత్వోద్యోగాలు.. విద్యార్థినులకు స్కూటీ: ప్రియాంక

ABN , First Publish Date - 2021-10-24T08:11:46+05:30 IST

వచ్చే ఏడాదిలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం(23వ తేదీ) నుంచి నవంబరు 1 వరకూ ప్రతిజ్ఞ యాత్రలు మొదలుపెట్టారు.

20 లక్షల ప్రభుత్వోద్యోగాలు..  విద్యార్థినులకు స్కూటీ: ప్రియాంక

లక్నో, అక్టోబరు 23: వచ్చే ఏడాదిలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం(23వ తేదీ) నుంచి నవంబరు 1 వరకూ ప్రతిజ్ఞ యాత్రలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బరబాంకిలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. హామీల జల్లు కురిపించారు. ‘‘యూపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. 20లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇస్తాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం. ఇంటర్‌ పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్‌, డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీ ఇస్తాం. రైతుల రుణాలను మాఫీ చేస్తాం. గోధుమలు, వరికి రూ.2500, క్వింటాలు చెరకుకు రూ.400 మద్దతు ధరగా నిర్ణయిస్తాం. కరోనా విపత్తు సమయంలోని విద్యుత్తు బిల్లులను అందరికీ రద్దు చేస్తాం. పేదలకు రూ.25వేల చొప్పున ఆర్థిక చేయూతనిస్తాం’’ అని ఆమె ప్రకటించారు.  

Updated Date - 2021-10-24T08:11:46+05:30 IST