‘చిమ్ముల’ ఇంట్లో 20 గంటల పాటు ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2021-02-26T05:28:20+05:30 IST

బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు దాదాపు 20 మంది ఐటీ అధికారులు గుమ్మడిదలలోని చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

‘చిమ్ముల’ ఇంట్లో 20 గంటల పాటు ఐటీ సోదాలు
ఐటీ అధికారులు తనిఖీలు చేసిన గుమ్మడిదలలోని గోవర్ధన్‌రెడ్డి నివాసం

 ఎంఎ్‌సఎన్‌ పరిశ్రమతో లావాదేవీలే కారణం?

 గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో తనిఖీల వివరాలు వెల్లడించని

 ఆదాయ పన్ను శాఖ అధికారులు


గుమ్మడిదల, ఫిబ్రవరి 25: ఫార్మసీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమతో గుమ్మడిదలకు చెందిన పారిశ్రామికవేత్త, టీఆర్‌ఎస్‌ నేత గోవర్ధన్‌రెడ్డి నిర్వహిస్తున్న మహాసాయి లేబరేటరీకి ఉన్న వ్యాపార లావాదేవీలే ఐటీ దాడులకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు దాదాపు 20 మంది ఐటీ అధికారులు గుమ్మడిదలలోని చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ అంశాలపై కుటుంబ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన రెండు పరిశ్రమలు, హైదరాబాద్‌లోని అతడి బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. అదే రోజు ఎంఎ్‌సఎన్‌ పరిశ్రమ హెడ్‌ ఆఫీ్‌సలో కూడా తనిఖీ చేశారు. 

Updated Date - 2021-02-26T05:28:20+05:30 IST