20కోట్ల జెండాలు అందుబాటులోకి!

ABN , First Publish Date - 2022-08-14T08:41:41+05:30 IST

‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మొత్తం 20కోట్లకు పైగా జెండాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

20కోట్ల జెండాలు అందుబాటులోకి!

దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా కోసం తీసుకొచ్చాం: కేంద్రం

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌, ఆగస్టు 13: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మొత్తం 20కోట్లకు పైగా జెండాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. శనివారం నుంచి ఈ నెల 15 వరకూ ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం రెపరెపలాడాలంటూ మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబా(100), గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన నివాసం వద్ద పిల్లలకు జాతీయ పతాకాలను పంచిపెట్టి, ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో పాలుపంచుకున్నారు.


ఇక గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌లోని చిల్డ్రన్స్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఇప్పటి వరకూ నాగ్‌పూర్‌లోని తమ ప్రధాన కార్యాలయంపై జాతీయ పతాకం ఎగురవేయలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఇటీవల ఎద్దేవా చేసిన నేపథ్యంలో  సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

Updated Date - 2022-08-14T08:41:41+05:30 IST