Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 13 2021 @ 17:57PM

ఓవైసీ కబ్జాలో 20 ఎకరాలు: నౌహీరాషేక్‌

హైదరాబాద్: తాను జైల్లో ఉన్నప్పుడు తనకు చెందిన 20 ఎకరాలను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కబ్జాచేశాడని హీరా గ్రూప్‌ చైర్మన్ నౌహీరా షేక్‌ సంచలన ఆరోపణలు చేశారు. టోలీచౌకీలో ఉన్న స్థలం విషయంలో అసద్‌తో తనకు గొడవ జరిగిందని నౌహీరాషేక్‌ పేర్కొన్నారు. దీంతోనే అసదుద్దీన్ ఓవైసీ తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని నౌహీరాషేక్‌ తెలిపారు. తన అరెస్ట్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని నౌహీరా షేక్‌ ఆరోపించారు.


హీరా గ్రూప్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని నౌహీరా వివరించారు. త్వరలోనే డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లిస్తామని నౌహీరా తెలిపారు. హీరా గ్రూప్‌కి తెలంగాణలోనే 5 వేల కోట్ల ఆస్తులున్నాయని ఆమె పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి రెండేళ్లుగా బిజినెస్‌ దెబ్బతీశారని నౌహీరా షేక్‌ విమర్శించారు. స్కీముల పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నౌహీరా షేక్‌ని గతంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హీరా గ్రూప్స్‌కు సంబంధించి పలు రాష్ట్రాల్లో 160 బ్యాంకు ఖాతాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మనీ సర్క్యులేషన్‌ స్కీం పేరుతో సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా సొమ్ములను హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ రూ.వందల కోట్ల స్థిరాస్తులను సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ, విదేశాల్లో మొత్తం 43 చోట్ల స్థిరాస్తులున్నాయని అనుమానిస్తున్నారు. 

Advertisement
Advertisement