Earthen vessel: రెండు వేల ఏళ్లనాటి ప్రాచీన మట్టి పాత్ర లభ్యం

ABN , First Publish Date - 2022-08-02T16:17:47+05:30 IST

ఉశిలంపట్టి సమీపంలో పుత్తూర్‌ అయన్‌మేట్టుపట్టిలో భూమిని చదును చేస్తున్న సమయంలో 2 వేల ఏళ్లనాటి(2 thousand years old) ప్రాచీన మట్టి

Earthen vessel: రెండు వేల ఏళ్లనాటి ప్రాచీన మట్టి పాత్ర లభ్యం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 1: ఉశిలంపట్టి సమీపంలో పుత్తూర్‌ అయన్‌మేట్టుపట్టిలో భూమిని చదును చేస్తున్న సమయంలో 2 వేల ఏళ్లనాటి(2 thousand years old) ప్రాచీన మట్టి పాత్ర(Earthen vessel) ఇనుప గొడ్డలితో పాటు లభించింది. మదురై(Madurai) జిల్లా అయన్‌మేట్టుపట్టిలో ఆండిస్వామి తోట సమీపంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఇవి బయటపడ్డాయి. పురావస్తు, రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌(Tehsildar) కరుపయ్య మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పురావస్తు పరిశోధనలు చేపట్టాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు  తెలిపారు.

Updated Date - 2022-08-02T16:17:47+05:30 IST