షీప్ అండ్ ఫిష్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ను హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో సన్మానిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, భగత్, లింగయ్య, భూపాల్‌రెడ్డి, కిషోర్‌కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు దీపిక, సందీప్‌రెడ్డి
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్
షీప్, గోట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాలరాజు యాదవ్
నడిగూడెం/నకిరేకల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. రాష్ట్ర సాహి త్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, షీప్, గోట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజుయాదవ్ ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేయటంతో జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది.
జర్నలిస్టుగా, సాహితీవేత్తగా
చారిత్రక నేపథ్యం ఉన్న సూర్యాపేట నడిగూడెం గ్రామానికి చెందిన జూలూరి గౌరీశంకర్ అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. బీసీ కమీషన్ సభ్యుడిగా వ్యవహరించిన జూలూరి గౌరీశంకర్ పదవీకాలం పూర్తికాగా; తాజాగా సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులయ్యారు. నడిగూడెంకు చెందిన ఉపాధ్యాయులు చిన బసవయ్య, సక్కుబాయమ్మలకు ఆరుగురు సంతానం కాగా అందులో మొదటి వాడైన గౌరీశంకర్ చిన్ననాటి నుంచే చదువులోనూ, సాహిత్యంలోనూ చురుకుగా ఉండేవారు. స్థానిక కొల్లుపాపయ్య చౌదరీ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అనంతగిరిలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాక, 1983, 85 మధ్య కాలంలో అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఆ తర్వాత 10 ఏండ్ల పాటు కోదాడలోని తెలుగు లెక్చరర్‌గా పని చేశాడు. సాహిత్యంపై ఉన్న మక్కువతో లెక్చరర్ వృత్తిలో ఉంటూ మరో దశాబ్ధ కాలం పాటు వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాద్‌కు కేసీఆర్, ప్రోఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ వంటి వారి ప్రేరణలతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ యాస, బాష, సంస్కృతి కలలపై కవితలు, సంకలనాలు రచించారు.
జూలూరి గౌరీశంకర్ బయోడేటా
పేరు: జూలూరి గౌరీశంకర్
స్వస్థలం: నడిగూడెం, సూర్యాపేట జిల్లా
తల్లిదండ్రులు: చిన బసవయ్య, సక్కుబాయమ్మ
ఆరుగురు సంతానంలో మొదటివాడు
విద్యాభ్యాసం : నడిగూడెంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అనంతగిరిలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసిజర్నలిస్టుగా, లెక్చరర్‌గా: కోదాడలో లెక్చరర్‌గా పనిచేస్తూనే వివిధ పత్రికల్లో పదేళ్ల పాటు జర్నలిస్టుగా కొనసాగారు.
విద్యార్థి ఉద్యమకారుడికి దక్కిన గౌరవం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రా మానికి చెందిన దూదిమెట్ల బాలరాజుయాదవ్ 2009 లో జరిగిన తెలంగాణా మలిదశ ఉద్యమంలో ఉస్మాని యా యూనివర్శిటీ నుంచి విద్యార్థి జేఏసీ నాయకునిగా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరి గిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 50 రోజుల పాటు రెండు సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి పీహెచ్డీ పట్టా పొందారు. అదే సమయంలో పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్లో పీహెచ్డీ చదువుతున్న రాజేశ్వరిని కులాంతర వివాహం చేసుకుకున్నారు. ఉద్యమ సమయంలో వివిధ వేదికలపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని బలంగా వినిపించి అప్పట్లోనే సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకా శం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరటంతో బాలరాజుయాదవ్ పేరును కూడా అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. రాజకీయ సమీకరణలో భాగంగా నోముల భగత్‌కు అవకాశమివ్వడంతో బాలరాజుయాదవ్ ఆశలు నెరవేరలేదు. ఈటెల రాజేందర్ గెలుపు అనంతరం పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందన్న అంతర్గత ప్రచారం అసంతృప్తులు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించటంపై టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉద్యమకారులు హర్షం వెలిబుచ్చుతున్నారు.
దూదిమెట్ల బాలరాజుయాదవ్ బయోడేటా
పేరు: దూదిమెట్ల బాలరాజుయాదవ్
స్వస్థలం:పాలెంగ్రామం, నకిరేకల్ మండలం,నల్లగొండ జిల్లా
తల్లిదండ్రులు: అమృత, భిక్షమయ్య
పుట్టిన తేదీ: 1.1.1981
విద్యార్హతలు: పీహెచ్డీ(జువాలజీ), ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
ఉద్యమ నేపథ్యం: 1999లో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి, 2006లో ఓయూలో పీహెచ్‌డీలో చేరి తెలంగాణవాదిగా, కేసీఆర్ ఏర్పాటు చేసిన ఓయూ జేఏసీలో వ్యవస్థాపక సభ్యుడు, మలిదశ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త గా, విద్యార్థి జేఏసీ నేత.