Iranలో ఫైటర్ జెట్ కూలి ఇద్దరు పైలట్ల మృతి

ABN , First Publish Date - 2022-05-24T21:07:56+05:30 IST

దక్షిణ టెహ్రాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో F-7 శిక్షణా విమానం కుప్పకూలి అందులోని ఇద్దరు పైలట్లు..

Iranలో ఫైటర్ జెట్ కూలి ఇద్దరు పైలట్ల మృతి

టెహ్రాన్: దక్షిణ టెహ్రాన్‌ (South Tehran) లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో F-7 శిక్షణా విమానం కుప్పకూలి అందులోని ఇద్దరు పైలట్లు మృతి చెందినట్టు ప్రభుత్వ  వెబ్‌సైట్ మంగళవారంనాడు తెలిపింది. అనారక్ జిల్లాలో ఉదయం ఈ ఘటన జరిగినట్టు ఆ వెబ్‌సైట్ పేర్కొంది. శిక్షణా కార్యక్రమంలో ఉండగా విమానం కుప్పకూలినట్టు ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మోహమ్మది-రెజ జన్నె్సారి తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో ఇరాన్ వైమానిక దళానికి చెందిన పలు విమానాలు కుప్పకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాలంచెల్లిన విమానాలకు విడిభాగాలు సేకరించడం కష్టంగా ఉందని అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు.


గత ఫిబ్రవరిలో ఇరానియన్ ఎఫ్-5 విమానం వాయవ్య ప్రాంత నగరమైన తబ్రిజ్‌లోని జనావాసాల్లో కుప్పకూలడంలో ఇద్దరు సిబ్బంది సహా ముగ్గురు మృతి చెందారు. ఇరాన్‌ వద్ద సోవియట్ యూనియన్ కాలం నాటి రష్యా మిగ్, సుఖోయ్ ఫైటర్లతో పాటు చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్-7లు ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ ఫ్లీట్‌లో కొన్ని అమెరికన్ ఎఫ్-4, ఎఫ్-5 జెట్లు ఉండగా, ఇవి 1979 ఇస్లామిక్ రివల్యూషన్ నాటివి.



Updated Date - 2022-05-24T21:07:56+05:30 IST