ఉడికించిన ఎండలు

ABN , First Publish Date - 2021-08-02T08:25:38+05:30 IST

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి

ఉడికించిన ఎండలు

సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికం


అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాష్ట్రంలో ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈదురుగాలులు వీచాయి.


అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, కడప, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 35-40 కి.మీ, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 25-35 కి.మీ, మిగిలిన జిల్లాల్లో గంటకు 20-30 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. రాష్ట్రంలో పశ్చిమ గాలుల కారణంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-08-02T08:25:38+05:30 IST