ఇంగ్లండ్‌లో మరో రెండు మంకీపాక్స్ కేసులు..!

ABN , First Publish Date - 2022-05-16T01:03:41+05:30 IST

ఇంగ్లండ్‌లో తాజాగా మరో ఇద్దరు మంకీ పాక్స్ వైరస్ బారినపడ్డారు. బ్రిటన్ హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ ఈ విషయాన్ని శనివారం ధృవీకరించింది.

ఇంగ్లండ్‌లో మరో రెండు మంకీపాక్స్ కేసులు..!

ఎన్నారై డెస్క్: ఇంగ్లండ్‌లో తాజాగా మరో ఇద్దరు మంకీ పాక్స్ వైరస్ బారినపడ్డారు. బ్రిటన్ హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ ఈ విషయాన్ని శనివారం ధృవీకరించింది. మంకీవైరస్ తొలి కేసు నమోదైన వారం తరువాత  తాజా కేసులు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశమవుతోంది. అయితే.. తొలి కేసుకు ఈ పరిణాంతో ఎటువంటి సంబంధం లేదని బ్రిటన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘మంకీ వైరస్‌ దేశంలో ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం  దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ఈ వైరస్ వేగంగా వ్యాపించదని ప్రజలు గుర్తించాలి’’ అని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మంకీ వైరస్ వ్యాధి అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని బారిన పడ్డ వారు సాధారణంగా తమంతట తామే కోలుకుంటారని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-16T01:03:41+05:30 IST