6 అడుగుల దూరం పాటించకపోతే.. 2లక్షల ఫైన్

ABN , First Publish Date - 2020-04-03T21:13:23+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీని నియంత్రణకు పలు దేశాలి లాక్‌డౌన్‌లు విధించి, కఠిన నిర్ణయాలు....

6 అడుగుల దూరం పాటించకపోతే.. 2లక్షల ఫైన్

టొరంటో: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీని నియంత్రణకు పలు దేశాలి లాక్‌డౌన్‌లు విధించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి పలు దేశాలు. ఈ క్రమంలో ఇళ్లలో ఉండేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కెనడాలోని టొరంటో నగర మేయర్ సూచించారు. కొంతమంది కావాలనే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు.


ఇటువంటి వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా ఒకే కుటుంబంలో వారైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘిస్తే వారికి 3500 డాలర్లు జరిమానా విధిస్తానని స్పష్టంగా  వినిపించారు. కాగా, కెనడాలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా173 మంది మరణించారు

Updated Date - 2020-04-03T21:13:23+05:30 IST