Srilanka Crisis : పెట్రోల్ కొరతతో నవజాత శిశువు కన్నుమూత

ABN , First Publish Date - 2022-05-24T02:03:29+05:30 IST

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభం శ్రీలంక వాసులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఒకవైపు.. కొందామన్నా లభ్యంకాని ఇంధనం మరోవైపు శ్రీలంకేయుల మనుగడకు సవాళ్లుగా మారాయి. అనూహ్యంగా వచ్చిపడిన కష్టాలు అక్కడ కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపు

Srilanka Crisis : పెట్రోల్ కొరతతో నవజాత శిశువు కన్నుమూత

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభం శ్రీలంక వాసులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఒకవైపు.. కొందామన్నా లభ్యంకాని ఇంధనం మరోవైపు శ్రీలంకేయుల మనుగడకు సవాళ్లుగా మారాయి. అనూహ్యంగా వచ్చిపడిన కష్టాలు కొందరి జీవితాల్లో విషాదాలను నింపుతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. పెట్రోల్ లభ్యంకాకపోవడంతో ఓ తండ్రి తన 2 రోజుల నవజాత శిశువు ప్రాణాలను దక్కించుకోలేకపోయాడు. కామెర్లతో బాధపడుతున్న తన చంటిబిడ్డను సకాలంలో ఆస్పత్రికి చేర్చలేక నరకయాతన అనుభవించాడు. గంటల కొద్దీ అన్వేషించిన తర్వాత పెట్రోల్ దొరికినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. చిన్నారి ప్రాణాలు పోయాయి.  విషాదకరమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


శ్రీలంకలోని కొలంబో నగరానికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్దాముల్లాలో నివాసముంటున్న తల్లిదండ్రులకు ఈ కడుపు కోత మిగిలింది. కామెర్లతో బాధపడుతున్న శిశువు పాలుతాగడం మానేసింది. క్రమంగా ఆరోగ్యం దిగజారింది. హాస్పిటల్‌కు తరలించాల్సిందేనని  కుటుంబ సభ్యులు పసిగట్టారు. తనకున్న ఆటోలో చిన్నారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని తండ్రి నిర్ణయించాడు. కానీ ఇంధన కొరత రూపంలో అతడికి పెద్ద కష్టమే ఎదురొచ్చింది. పెట్రోల్ కోసం గంటల కొద్దీ అన్వేషించాడు. చివరి పెట్రోల్ దొరికినా ఆశించిన ఫలితం దక్కలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపు శిశువు ఆరోగ్యం మరింత విషమించింది. హాస్పిటల్‌లో ఈటీయూ(ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ యూనిట్)కు తరలించినా చిన్నారి ప్రాణాలు నిలవలేదు. చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు ఈ విషాదకర ఘటనను ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. శిశువుని హాస్పిటల్‌లో చేర్పించడంలో జాప్యం కారణంగా ఆరోగ్యం దిగజారిందని, క్రమంగా శిశువు ప్రాణాలు కోల్పోయిందని వైద్యుడు చెప్పారు. లీటర్ పెట్రోల్ల లభ్యమవ్వక చిన్నా ప్రాణాలను పోగొట్టుకున్నామనే వేదన తల్లిదండ్రులను జీవితాంతం బాధిస్తూనే ఉంటుందని ఫేస్‌బుక్‌లో వైద్యుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-24T02:03:29+05:30 IST