ఈ అక్కచెల్లెళ్లు మామూలోళ్లు కాదు.. ఇద్దరు అన్నదమ్ములతో పెళ్లి కుదుర్చుకుని, సరిగ్గా ఒక్కరోజు ముందు ఇచ్చిన షాక్‌తో..

ABN , First Publish Date - 2021-12-20T17:21:27+05:30 IST

మధ్యప్రదేశ్‌లో పెళ్లి పేరుతో ఇద్దరు యువతులు..

ఈ అక్కచెల్లెళ్లు మామూలోళ్లు కాదు.. ఇద్దరు అన్నదమ్ములతో పెళ్లి కుదుర్చుకుని, సరిగ్గా ఒక్కరోజు ముందు ఇచ్చిన షాక్‌తో..

మధ్యప్రదేశ్‌లో పెళ్లి పేరుతో ఇద్దరు యువతులు 2 లక్షల 50 వేల రూపాయలు తీసుకుని ఉడాయించారు. వారు తాము పేదింటివారిమని చెప్పి, పెళ్లి ఖర్చుల కింద రూ. 2.26 లక్షల రూపాయలు తీసుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వారిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఆ యువతుల తల్లి, మామలతో పాటు ఇద్దరు దళారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ కుమార్ జైన్ మాట్లాడుతూ కైమోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బఢారీ గ్రామానికి చెందిన 76 ఏళ్ల జగదంబా ప్రసాద్ దీక్షిత్ ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం అతనికి బసంత్ లాల్ దీక్షిత్, రాజేష్ దీక్షిత్ అనే ఇద్దరు కుమారులున్నారు. 


వారి ఇంటికి రెండు నెలల క్రితం సతానాకు చెందిన అరుణ్ కుమార్ తివారి, మన్సుఖ్ రైక్వార్ వచ్చారు. ఆ సమయంలో వారు సింధీ క్యాంపులో ఉంటున్న బబితా తివారీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని జగదంబా ప్రసాద్ దీక్షిత్‌కు  తెలియజేశారు. ఇంటి పెద్ద లేకపోవడంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నదన్నారు. ఈ మాట విన్న జగదంబా ప్రసాద్ దీక్షిత్.. బబితతో మాట్లాడి తన కుమారులకు ఆమె కుమార్తెలతో వివాహం చేయడానికి ఒప్పించాడు. నవంబరు 29న వివాహం చేయాలని నిశ్చయించారు. వధువుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న జగదంబా ప్రసాద్ దీక్షిత్ వారికి పెళ్లి ఖర్చుల కోసం ముందుగా రూ. 60 వేలు, ఆ తరువాత రూ. 50 వేలు బబితకు బ్యాంకు ఖాతా ద్వారా ఇచ్చారు. తరువాత జగదంబా ప్రసాద్ తన కుమారులకు ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఇందుకోసం లక్ష రూపాయలు ఖర్చు చేశాడు. ఇంతలో నవంబరు 28న బబిత తమ బంధువు చనిపోయారని జగదంబా ప్రసాద్ దీక్షిత్‌కు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి నిలిపివేయాలని కోరింది. దీనికి జగదంబా ప్రసాద్ ఒప్పుకుని బబితను పరామర్శించేందుకు వారు ఉంటున్న సతానాకు వెళ్లాడు. అక్కడ అతనికి బబిత తనను మోసం చేసిందని, ఆమె ఊరు నుంచి కూడా ఉడాయించిందని తెలిసింది. అలాగే ఆ యువతుల జాడ కూడా తెలియలేదు. దీంతో అతను వారికోసం తీవ్రంగా గాలించగా బబిత కుటుంబంతో సంబంధం ఉన్న ఉన్న ఒక వ్యక్తి దొరికాడు. కాగా బబిత ఇదేవిధంగా కుమార్తెల పెళ్లి పేరుతో మరొక కుటుంబాన్ని కూడా మోసగించిందని తేలింది. ఈ విషయం పోలీసులు వరకూ చేరింది. బబిత కారణంగా మోసపోయిన వారికి సంబంధించిన ఫిర్యాదులను అందుకున్న పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-20T17:21:27+05:30 IST