హై క్వాలిటీ పేపర్‌ పేరుతో తెలంగాణ మద్యం తెచ్చి..

ABN , First Publish Date - 2021-05-16T05:45:44+05:30 IST

తెలంగాణా మద్యాన్ని విక్ర యిస్తున్న ఇద్దరు నింది తు లను ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ. దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ అరెస్ట్‌ చేసింది.

హై క్వాలిటీ పేపర్‌ పేరుతో తెలంగాణ మద్యం తెచ్చి..
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

ఏలూరు క్రైం, మే 15: తెలంగాణా మద్యాన్ని విక్ర యిస్తున్న ఇద్దరు నింది తు లను ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ. దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో  ఐడీ పార్టీ   అరెస్ట్‌ చేసింది. ఏలూరు మినీ బైపాస్‌ ప్రాం తానికి చెందిన వేమనేడు త్రినాథ్‌ బాబు, పర్సా పాం డు రంగ సాయి కలిసి హైదరాబాద్‌ నుంచి మద్యా న్ని కొనుగోలు చేసి అట్టపెట్టెల్లో ప్యాక్‌ చేసి హై క్వాలిటీ పేపర్‌గా చెప్తూ ఆర్టీసీ కొరియర్‌ ద్వారా బుక్‌ చేసుకుని ఆర్టీసీ బస్సులో ఏలూరు తీసుకువచ్చారు. ఈ విధంగా ఇప్పటికే మూడు సార్లు తీసుకువచ్చి ఏలూరు హనుమాన్‌నగర్‌ కాల్వగట్టు పోరంబోకు స్థలంలో చిన్న రేకు షెడ్డులో నిల్వ చేసి  విక్రయిస్తున్నారు.  సమాచా రం  డీఎస్పీకి అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఏలూరు రూరల్‌ సీఐ ఎ శ్రీనివాసరావు, ఎస్‌ఐ చావా సురేష్‌,  ఐడీ పార్టీ సిబ్బంది  దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడైన  త్రినాధ్‌బాబు ఈ ఏడాది మార్చిలో తెలంగాణా నుంచి మద్యం తీసుకువస్తూ విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం వద్ద పట్టుబడి జైలుకి వెళ్ళాడు. వీరి వద్ద 695 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-16T05:45:44+05:30 IST