టాటాల గూటికి 1 ఎంజీ?

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

విభిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్‌ ఈ-ఫార్మా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇ-ఫార్మా వ్యాపారంలోని స్టార్టప్‌ 1 ఎంజీలో 65 శాతం వాటాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని

టాటాల గూటికి 1 ఎంజీ?

ఈ-ఫార్మాలో అడుగు రిలయన్స్‌, అమెజాన్‌లకు పోటీ


న్యూఢిల్లీ: విభిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్‌ ఈ-ఫార్మా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇ-ఫార్మా వ్యాపారంలోని స్టార్టప్‌ 1 ఎంజీలో 65 శాతం వాటాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈటీ నౌ తెలిపింది. డీల్‌లో భాగంగా 1 ఎంజీ విలువ రూ.1200 కోట్లుగా లెక్క కట్టారని తెలుస్తోంది. టాటాల గూటికి చేరిన తర్వాత కూడా 1 ఎంజీ సహ వ్యవస్థాపకులు ప్రశాంత్‌ టాండన్‌, గౌరవ్‌ అగర్వాల్‌ సంస్థ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహిస్తారు. 1 ఎంజీ 2015 సంవత్సరంలో హెల్త్‌కార్ట్‌ నుంచి వెలుపలికి వచ్చింది. ఇప్పటివరకు ఆ సంస్థ సికోయా, ఐఎ్‌ఫసీ, ఒమిడ్యార్‌ వంటి కంపెనీల నుంచి 20 కోట్ల డాలర్ల వరకు నిధులు సమీకరించింది.


ఈ డీల్‌ ఖరారైతే ఇ-ఫార్మా వ్యాపారంలోకి అడుగు పెట్టిన రెండో కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ అవుతుంది. రియలన్స్‌ ఇప్పటికే నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేసి ఆ రంగంలోకి అడుగు పెట్టింది. ఇ-ఫార్మా వ్యాపారంలో టాటా గ్రూప్‌ రిలయన్స్‌, అమెజాన్‌లతో పోటీ పడుతుంది. టాటా గ్రూప్‌ ఇప్పటికే గ్రోసరీల ఇ రిటైలింగ్‌ సంస్థ బిగ్‌ బాస్కెట్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు 1 ఎంజీని కూడా దక్కించుకున్నట్టయితే అన్ని వినియోగ వస్తువులు, సేవలను ఒకే ఛత్రం కింద నిర్వహించగలుగుతుంది. అలాగే టాటా డిజిటల్‌ కింద వినియోగ వస్తువుల సూపర్‌ యాప్‌ నిర్మించాలన్న వారి కల సాకారం అవుతుంది.

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST