1908 కేసులు... 8 మరణాలు

ABN , First Publish Date - 2021-05-13T06:24:19+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1908 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలూ నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 145814కు చేరుకోగా బుధవారం ఉదయానికి 21262 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు పేర్కొన్నారు.

1908 కేసులు... 8 మరణాలు
పద్మావతీ కొవిడ్‌ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన షెడ్‌లో పేషెంట్లకు అందిస్తున్న ఆక్సిజన్‌

రాష్ట్ర ప్రభుత్వ బులెటిన్‌లో వెల్లడి


కరోనాతో పుంగనూరులో మాజీ కౌన్సిలర్‌ మృతి


పీలేరులో ప్రసాద్‌ కొవిడ్‌ ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసు


తిరుపతి, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1908 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలూ నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 145814కు చేరుకోగా బుధవారం ఉదయానికి 21262 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు పేర్కొన్నారు. ఇక మరణాల సంఖ్య 1059కి చేరాయి.తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 485, చిత్తూరులో 133, మదనపల్లెలో 111, చంద్రగిరిలో 98, తిరుపతి రూరల్‌లో 88, పుత్తూరులో 76, రేణిగుంటలో 73, నగరిలో 53 వున్నాయి.ఏర్పేడులో 52, రామచంద్రాపురం, శ్రీకాళహస్తిల్లో 46 చొప్పున, కుప్పంలో 44, శ్రీరంగరాజపురంలో 36, పీలేరులో 35, సత్యవేడులో 22, వడమాలపేట, సత్యవేడుల్లో 22 వంతున, గుడిపాల, కలికిరిల్లో 21 చొప్పున, గుడుపల్లె, ఐరాల, పుంగనూరు, తవణంపల్లె, విజయపురం మండలాల్లో 20 చొప్పున, పలమనేరులో 19, నాగలాపురం, రామకుప్పం మండలాల్లో 18 వంతున, జీడీనెల్లూరు, కార్వేటినగరం, వెదురుకుప్పం, వి.కోట మండలాల్లో 17 వంతున, నారాయణవనంలో 16, పాకాలలో 14, నిండ్ర, వాల్మీకిపురాల్లో 13 చొప్పున, గుర్రంకొండలో 12, పాలసముద్రంలో 10, రొంపిచెర్ల, శాంతిపురాల్లో 9 వంతున, బి.కొత్తకోట, పులిచెర్ల మండలాల్లో 8 వంతున, బంగారుపాలెం, చౌడేపల్లె, ములకలచెరువు, పీటీఎం, పిచ్చాటూరు మండలాల్లో 7 వంతున, పెద్దపంజాణి, సోమల, తొట్టంబేడు మండలాల్లో 6 వంతున, బైరెడ్డిపల్లె, గంగవరం మండలాల్లో 5 వంతున, కేవీబీపురం, కలకడ, కేవీపల్లె, కురబలకోట, పెనుమూరు,పూతలపట్టు,సదుం, యాదమరి మండలాల్లో 4 వంతున, చిన్నగొట్టిగల్లు, పెద్దమండ్యం, రామసముద్రం మండలాల్లో 3 వంతున, నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, ఎర్రావారిపాలెం మండలాల్లో 2 వంతున కొత్త కేసులు నమోదు కాగా బీఎన్‌ కండ్రిగలో ఓ కేసు నమోదయ్యింది.









 ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో  529 పడకల ఖాళీ 


తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బుధవారం రాత్రి 11  గంటలకు 529  బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. విష్ణునివాసంలో 165, శ్రీనివాసంలో 168, రుయాలో 65 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 68 నాన్‌ ఆక్సిజన్‌ పడకలు, ఆయుర్వేద వైద్యశాలలో 18 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 45 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-05-13T06:24:19+05:30 IST