Advertisement
Advertisement
Abn logo
Advertisement

19 ఏళ్ల యువతి తన 61 ఏళ్ల ప్రియుడిని ఇంట్లోని వారికి పరిచయం చేసింది... ఇది నచ్చని ఆమె తల్లి ఏం చేసిందంటే...

వాషింగ్టన్: అమెరికాకు చెందిన 19 ఏళ్ల యువతి 61 ఏళ్ల వృద్ధుడిని వివాహం చేసుకున్న తరువాత... తన కుటుంబ సభ్యులు తనను ఎలా అవమానపరిచారనే విషయాలను మీడియాకు వివరించారు. గతంలో తన ప్రియుడిని ఇంట్లోని వారికి పరిచయం చేసేందుకు తీసుకువెళ్లినపుడు కుటుంబ సభ్యులు తమను చూడగానే పోలీసులను పిలిచి, నానా హంగామా చేశారన్నారు.  ఆ తరువాత తాము వివాహం చేసుకున్నామని ఆమె తెలిపారు. తన ప్రియుడు ఇద్దరు పిల్లల తండ్రి అని కూడా తనకు తెలుసన్నారు. అయితే తాము వివాహం చేసుకున్న తరువాత తన ఇంటిలోని వారు తమను ఘనంగా స్వాగతించారన్నారు. కాగా ఈ దంపతుల మధ్య 42 ఏళ్ల వయసు తేడా ఉంది. వీరి ప్రేమ కథ ఎంతో ఆసక్తికరంగా సాగింది. 

19 ఏళ్ల స్మయిలీ మూన్ 2020లో పోలీసు అధికారి కెవిన్(61)ను కలుసుకుంది. ఉద్యోగంలో అతని సీనియాటీని చూసి మూన్ అతనికి ఆకర్షితురాలైంది. పరిచయమైన కొద్ది కాలానికే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత వీరిద్దరూ తమ మధ్యగల అన్ని విషయాలను చర్చించుకున్నారు. కెవిన్ గురించి మూన్ మాట్లాడుతూ... కెవిన్ ఎంతో అందగాడని, తమ మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధం మరింత దగ్గర చేసిందన్నారు. కాగా కెవిన్‌కు అప్పటికే వివాహం కాగా, అతనికి 16-23 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement