కరోనా ఎఫెక్ట్: అగ్రరాజ్యంలో పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య..!

ABN , First Publish Date - 2020-06-05T07:25:07+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గత వారం 1.9 మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చే

కరోనా ఎఫెక్ట్: అగ్రరాజ్యంలో పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య..!

వాషింగ్టన్: లాక్‌డౌన్ నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గత వారం 1.9 మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4కోట్లు దాటింది. కాగా.. ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో అమెరికాలో వ్యాపార సముదాయాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయినప్పటికీ నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య గణణీయంగా పెరుగుతోంది. గత నెలలో అమెరికాలో నిరుద్యోగ రేటు 14.7 నుంచి 19.8కు పెరిగిందనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 19.12లక్షల మంది కరోనా బారినపడగా.. మరణించిన వారి సంఖ్య లక్షదాటింది. 


Updated Date - 2020-06-05T07:25:07+05:30 IST