ఆందోళన బాటలో రేషన్‌ డీలర్లు!

ABN , First Publish Date - 2022-07-17T04:12:01+05:30 IST

రేషన్‌ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించలంటూ ఆందోళన బాట పట్టారు.

ఆందోళన బాటలో రేషన్‌ డీలర్లు!
నిరనన వ్యక్తం చేస్తున్న డీలర్లు (ఫైల్‌)

రేపు విజయవాడలో..

ఆగస్టు 2న ఢిల్లీలో నిరసన

నెల్లూరు(హరనాథఫురం), జూలై 16 : రేషన్‌ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించలంటూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపిన వారు ఈనెల 18వ తేదీనవిజయవాడలో, ఆగస్టు 2న ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతునున్నారు.  అసలేమైందంటే ప్రజలకు ఎండీయూ ఆపరేటర్లు పంపిణీ చేసే రేషన్‌ సరుకులకు డీలర్లు  డీడీలు ఇచ్చి సరకులు తెచ్చి ఎండీయూ ఆపరేటర్లకు ఇస్తారు. వారు లబ్ధిదారులకు విక్రయిస్తారు. అయితే ఆ బియ్యం నగదు సక్రమంగా చెల్లించకపోగా రిటన్‌ సరుకుల వివరాలు సక్రమంగా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సరకులు ఒకేసారి తీసుకొంటామని ఈపా్‌సలో వేలిముద్ర వేసి ఆ తరువాత చెప్పిన మొత్తాన్ని తీసుకోకుండా విడతల వారీగా తీసుకోవడంతో సరుకుల నిల్వలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఈ  సందర్భంలో అధికారులు దాడులు చేస్తే హెచ్చుతగ్గులపై డీలర్ల మీద 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు ఎండీయూ ఆపరేటర్లు సరకుల పంపిణీలో చేస్తున్న తప్పులకు తాము ఇబ్బందులు పడుతున్నామని, దింపుడు కూలీలు, కొట్టుబాడుగ భరిస్తూ అనాదిగా ఉన్న డీలర్‌ వృత్తిని వదులుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డీలర్లు ఆందోళన బాట పట్టారు. 


డీలర్ల డిమాండ్లు ఇవే :

జాతీయ ఆహార భద్రతా చట్టప్రకారం డీలర్ల ద్వారానే సరకులు పంపిణీ చేయించాలి.

ఎండీయూ ఆపరేటర్లను డ్రైవర్‌లుగానే ఉంచాలి. 

రేషన్‌ డీలర్లకు ఒక క్వింటాకు రూ.440 కమీషన్‌ ఇవ్వాలి. 

మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎ్‌స బకాయిలు వెంటనే చెల్లించాలి. 

రేషనలైజేషన్‌ మ్యాపింగ్‌ సక్రమంగా జరిపి డీలర్లకు సమానం చేయాలి

దీలర్ల ఆథరైజేషన్‌కు సంబంధించి ఆర్డీవో కార్యాలయాల్లో రెన్యువల్‌ చేయాలి. 

ఈ-పాస్‌ ఆపరేటర్లు ఉచితంగా రిపేర్లు చేయాలి.

2020 ఆగస్టుకు సంబంధించి కమీషన్‌ డీలర్‌ల బ్యాంకు ఖాతాలో వేయాలి. 


డీలర్లతోనే సరకులు పంపిణీ చేయించాలి

డీలర్ల ద్వారానే రేషన్‌ సరకులు పంపిణీ చేయించాలి. ఎండీయూ ఆపరేటర్లను డ్రైవర్లుగా పరిగణించాలి. డీలర్లకు క్వింటాంకు రూ.440 కమీషన్‌ ఇవ్వాలి. ఎంయూడీ ఆపరేటర్లు ప్రతి రోజూ సరకు వెనక్కు ఇచ్చేటప్పుడు రిటన్‌ స్టాక్‌ కొట్టి సరుకు, రిటన్‌ డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎండీయూ ఆపరేటర్ల చేసే తప్పులకు డీలర్లను బాధ్యులను చేయొద్దు.

- జీవీ. కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎన్‌డీయూసీడీడీ సంక్షేమ సంఘం 

Updated Date - 2022-07-17T04:12:01+05:30 IST