Weather station: 18 వరకు ఉక్కపోత

ABN , First Publish Date - 2022-09-16T14:29:45+05:30 IST

తమిళనాడు, పుదుచ్చేరిలో ఈనెల 18 వరకు ఉక్కపోత ఉంటుందని వాతావరణ కేంద్రం(Weather station) వెల్లడించింది. నైరుతి రుతుపవన వ

Weather station: 18 వరకు ఉక్కపోత

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 15: తమిళనాడు, పుదుచ్చేరిలో ఈనెల 18 వరకు ఉక్కపోత ఉంటుందని వాతావరణ కేంద్రం(Weather station) వెల్లడించింది. నైరుతి రుతుపవన వర్షాలు ఈ ఏడాది జూన్‌ నుంచి కురుస్తున్నాయి. అక్టోబరు రెండో వారంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో, వర్షాలు తగ్గి ఉష్ణోగ్రత లు పెరుగుతాయని, మరో మూడు రోజులు ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2022-09-16T14:29:45+05:30 IST