18,872 మందికి వాహనమిత్ర

ABN , First Publish Date - 2020-06-05T11:25:11+05:30 IST

వాహనమిత్ర పథకానికి ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులతో కలిపి జిల్లాలో 18,872 మందికి రూ.18 కోట్ల 82 లక్షల 20 వేలు అందించినట్టు రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ..

18,872 మందికి వాహనమిత్ర

మంత్రి తానేటి వనిత అందజేత


ఏలూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): వాహనమిత్ర పథకానికి ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులతో కలిపి జిల్లాలో 18,872 మందికి రూ.18 కోట్ల 82 లక్షల 20 వేలు అందించినట్టు రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురు వారం వెలగపూడి సీఎం క్యాంపు కార్యాల యం నుంచి వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథ కం రెండో విడత ఆర్థిక సహాయాన్ని వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సీఎం జగన్మోహన్‌ రెడ్డి అందించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి మంత్రి తానేటి వనిత వీక్షించారు. ఈ సం దర్భంగా రూ.18.82 కోట్ల చెక్కును లబ్ధిదారు లకు అందజేసి విలేకరులతో మాట్లాడారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు.


తక్కువ సమయంలోనే ఎక్కువ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వివిధ పథకాల ద్వారా పేద కుటుంబాలు ఏడాది కాలంలో రూ.56 వేలు లబ్ధి పొందారన్నారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జేసీ కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షుశుక్లా, టీడీసీ ఎం.పురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


నాడు-నేడుకు రూ.224 కోట్లు 

జిల్లాలో మన బడి నాడు - నేడు కింద రూ.224 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు వెల్ల డించారు. కలెక్టరేట్‌లో నాడు - నేడు ప్రగతి పై గురువారం ఆయన సమీక్షించారు. ఈ పథకం కింద వివిధ పాఠశాలల్లో 80 శాతం ఎలక్ట్రికల్‌ పనులు పూర్తయ్యాయని ప్రకటిం చారు. టాయిలెట్లు, వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లు, ట్యాప్‌లను ఎక్కడికక్కడ ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సిమెంటుతోపాటు ఇతర సామ గ్రికి నివేదిక ఇవ్వాలన్నారు. చేపట్టిన పనుల ను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా అప్‌ లోడ్‌ చేయాలన్నారు. టాయిలెట్స్‌కు వాటర్‌ సమకూర్చే పైపు లైన్లు నిర్మాణ పనులకు ఆనుకుని ఉండకూడదని ఈ రకంగా ఉంటే లీకేజీ జరిగే అవకాశం ఉందని నాడు - నేడు సలహాదారు మురళి సూచించారు.  

Updated Date - 2020-06-05T11:25:11+05:30 IST