ఖరీఫ్‌లో రూ.1861 కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2021-06-18T05:13:51+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1861 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు. ఇప్పటి వరకూ రూ.732 కోట్లు ఇచ్చారని, మిగిలిన వారికి కూడా వెంటనే రుణాలు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు

ఖరీఫ్‌లో రూ.1861 కోట్ల రుణాలు
మాట్లాడుతున్న కలెక్టరు హరి జవహర్‌లాల్‌

 బ్యాంకర్లు, అధికారులు కలిసి పనిచేయండి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 17: ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1861 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు. ఇప్పటి వరకూ రూ.732 కోట్లు ఇచ్చారని, మిగిలిన వారికి కూడా వెంటనే రుణాలు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలను అర్హులైన వారికి అందజేయడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంటోందని తెలిపారు. ఇతర పథకాల్లో కూడా జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలంటే బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. పాడి పరిశ్రమలో జిల్లాకు మంచి భవిష్యత్‌ ఉందని, రాష్ట్రంలో చిత్తూరు తర్వాత ఆ స్థాయిలో పాల ఉత్పత్తి ఉండేది విజయనగరంలో మాత్రమేనని చెప్పారు. ఈ రంగానికి చేయూత పథకం కింద యూనిట్ల మంజూరుకు సహకరించాలని కోరారు. పశు సంవర్ధక శాఖ, డీఆర్‌డీఏ అధికారులు కూడా బ్యాంకులను నిత్యం సంప్రదిస్తూ జిల్లాకు మంజూరైన యూనిట్లన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని భావిస్తోందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో 34 వేల మందికి సీసీఆర్‌సీ కార్డులు ఇస్తున్నామని, వారందరికీ పంట రుణాలు ఇవ్వాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకటరావు ఆధ్వర్యంలో పనిచేసి వచ్చే డీసీసీ సమావేశం నాటికి లక్ష్యాలు సాధించి జిల్లాను రెండో స్థానంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నాబార్డు ఏజీఎం హరీష్‌ మాట్లాడుతూ బ్యాంకు రుణాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకే 40 శాతం తగ్గకుండా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రతి బ్యాంకు తమ పరిధిలోని ఎస్‌సీ, ఎస్‌టీ మహిళల పథకాలకు సంబంధించి ఏడాదిలో ఒక్క యూనిట్‌ అయినా మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ వెంకటరావు, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి బీసీ, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీలు నాగరాణి, జగన్నాఽథరావు, మెప్మా పీడీ సుధాకర్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ప్రసాదరావు, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-18T05:13:51+05:30 IST