అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఏపీలో మొత్తం 20,72,014 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,431 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,55,389 మంది రికవరీ చెందారు.