Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 7 2021 @ 06:55AM

కేరళ తరువాత కర్నాటకలో పెరుగుతున్న కరోనా కేసులు

బెంగళూరు: కర్నాటకలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29, 15,317కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 36 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 36,741కి చేరింది. కర్నాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో కరోనా నుంచి మొత్తం 1,854 మంది కోలుకున్నారు. 

దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 28,54,222. బెంగళూరులో కొత్తగా 441 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్నాటకలో 24,328 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి రేటు 1.11 శాతంగా ఉండగా, డెట్ రేటు 1.99 శాతంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూలో మార్పులు చేసింది. కేరళ, మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలలో వీకెండ్ కర్ప్యూను ఇప్పటికే ప్రకటించారు. కాగా కేరళ తరువాత కర్నాటకలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా పరిణమించింది. 

Advertisement
Advertisement