Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో ఓ యువకుడు.. రాత్రిపూట పక్కింట్లోకి నగ్నంగా వెళ్లి..

హైదరాబాద్: రాత్రిపూట ఓ యువకుడు వింతగా ప్రవర్తించాడు. ఒంటిమీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా పక్కింట్లోకి ప్రవేశించాడు. నేరేడ్‌మెట్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.


సంతోష్ నగర్ కాలనీలో ఉంటున్న 18 ఏళ్ల యువకుడు శనివారం రాత్రి విచిత్రంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఆ యువకుడు తన ఒంటి మీద దుస్తులు లేకుండా నగ్నంగా మారి పక్కింట్లోకి ప్రవేశించాడు. అక్కడ కిటికీలోంచి తొంగి చూశాడు. ఇది గమనించిన పక్కింటివారు ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లు వచ్చేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ యువకుడి ప్రవర్తనతో విసుగెత్తిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

బీ కేర్ఫుల్మరిన్ని...

Advertisement