Viral News: 61ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన 18ఏళ్ల యువతి.. అతడిలోని ఆ క్వాలిటీ చూసి ఫిదా అయినట్టు వెల్లడి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-07-01T13:21:17+05:30 IST

ఆమెకు 18ఏళ్లు. కానీ ఆమె తన కంటే 43ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడింది. అది కూడా ప్రేమించి మరీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రేమ కహానీని తెలుసుకుని నోరెళ్లబెడు

Viral News: 61ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన 18ఏళ్ల యువతి.. అతడిలోని ఆ క్వాలిటీ చూసి ఫిదా అయినట్టు వెల్లడి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 18ఏళ్లు. కానీ ఆమె తన కంటే 43ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడింది. అది కూడా ప్రేమించి మరీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రేమ కహానీని తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. అతడిలో ఏం చూసి ఆమె ఇంప్రెస్ అయిందో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో 61ఏళ్ల వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ యువతి ఎవరు? ఆమె లవ్ స్టోరీ ఎంటీ అనే పూర్తి వివరాలు మీకోసం..


61ఏళ్ల వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన ఆ యువతి పేరు ఆసియా. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతంలో నివసిస్తున్న ఈమె.. అదే ప్రాంతానికి చెందిన రాణా శంషాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. యువతి తన కంటే 43ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని Love Marrage చేసుకోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. దీంతో ఓ స్థానిక న్యూస్ ఛానల్ ఆ దంపతులను సంప్రదించి ఇంటర్యూ తీసుకుంది. ఆ సందర్భంగా ఆసియా మాట్లాడుతూ.. తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. రాణా శంషాద్ చాలా మంచి వాడని.. ఇతరులకు సహాయం చేసే గుణం ఆయనలో ఉందని  ఆమె పేర్కొంది. ఎంతో మంది పేద యువతుల పెళ్లిళ్లను ఆయన జరిపించినట్టు వెల్లడించింది. ఆయన చేస్తున్న మంచి పనులు తన దృష్టికి వచ్చి ఫిదా అయినట్టు తెలిపింది.



దీంతో రాణాతో రెండు మూడు సార్లు సమావేశమైనట్టు చెప్పింది. ఈ క్రమంలోనే ఆయనంటే తనకు ఇష్టం ఏర్పడిందని తెలిపింది. దీంతో తన ప్రేమ గురించి ఆయనకు చెప్పి, వివాహం చేసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నట్టు పేర్కొంది. రాణా తనను బాగా చూసుకుంటున్నాడని ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఈ దంపతులకు సంబంధించిన ఇంటర్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతడు ఎంత మంచి వాడైతే మాత్రం.. తాత వయసున్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నావ్. ఈ పెళ్లి పై మీ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-07-01T13:21:17+05:30 IST