Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంట్లో నుంచి బయటికి రాబోయి.. చిమ్నిలో ఇరుకున్న 18ఏళ్ల యువతి!

వాషింగ్టన్: 18ఏళ్ల యువతి ఇంటి నుంచి బయటికి రాబోయి.. చిమ్నిలో ఇరుక్కుపోయింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీం.. ఆ యువతిని క్షేమంగా బయటకు తీసిన ఘటన అమెరికాలోని నెవడ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కాగా.. ఫైర్‌ఫైటర్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వార్త నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లిన పోయిన సందర్భంలో 18ఏళ్ల యువతి ఇంట్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో సదరు యువతి ఇంటి నుంచి బయటపడటం ఎలా? అని ఆలోచించింది. 


ఈ నేపథ్యంలోనే చిమ్ని ద్వారా ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించి.. అందులో ఇరుక్కుపోయింది. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ఫైటర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అనంతరం రోప్ సిస్టమ్‌ను ఉపయోగించి.. సుమారు అరగంటపాటు శ్రమించి చిమ్ని నుంచి యువతిని బయటికి తీశారు. అయితే.. చిమ్నిలో ఇరుక్కుపోవడం వల్ల యువతికి ఎటువంటి గాయాలూ కాలేదని ఫైర్‌ఫైటర్ సిబ్బంది వెల్లడించారు. ఇదికాస్తా.. సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement