J&K కాల్పుల్లో గాయపడ్డ 18 ఏళ్ల Student ఆసుపత్రిలో మృతి

ABN , First Publish Date - 2022-05-10T23:12:48+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో security forces కు terrorist లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్లు తగిలి గాయాలపాలైన 18 ఏళ్ల Shahid Gani Dar అనే విద్యార్థి Army hospital లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు..

J&K కాల్పుల్లో గాయపడ్డ 18 ఏళ్ల Student ఆసుపత్రిలో మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో security forces కు terrorist లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్లు తగిలి గాయాలపాలైన 18 ఏళ్ల Shahid Gani Dar అనే విద్యార్థి Army hospital లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. షోపియన్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుండగా ఈ student తో పాటు ఒక ఆర్మీ జవాను, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన అనంతరం ఉగ్రవాదులు ఇద్దరు పౌరుల్ని లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. అయితే మెజారిటీ పౌరులు అప్పటికే సురక్షిత ప్రదేశంలో ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిని 92 బేస్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించే ప్రయత్ని చేశామని, అయినప్పటికీ షహిద్ గని దర్‌ను రక్షించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. గాయపడ్డ జవాను, ఇద్దరు పౌరుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని ఆయన తెలిపారు.

Read more