Abn logo
Sep 28 2021 @ 22:47PM

లస్కర్ల ఆకలి కేకలు!

కాలువలకు నీటిని విడుదల చేస్తున్న లస్కర్లు

18 నెలలుగా అందని వేతనాలు 

కుటుంబ పోషణ భారం 

పట్టించుకోని అధికారులు , పాలకులు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 28: మండలంలోని గండి పాళెం జలాశయం పరిధిలో పని చేస్తున్న లస్కర్ల ఆకలి కేకలు మి న్నంటుతున్నాయి. 18 నెలలుగా వేతనాలందక కుటుంబ పోషణ భారమై అవస్థలు పడుతున్నారు. తమ ఆర్థిక కష్టాలను ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథులే కరువయ్యారు. మెట్ట ప్రాంతాలైన వరికుంటపాడు, ఉదయగిరి మం డలాలకు గండిపాళెం జలాశయం వరప్రసాదిని. గతేడాది నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జలాశయం నిండుకుండాల మారడంతో గత రబీ, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఆయా మండలాల్లో 17 డిస్ట్రిబ్యూటరీల కింద 10 మంది లస్కర్లు నెలకు రూ.13,500 వేతనంతో ఔట్‌సోర్సింగ్‌ కింద విధులు నిర్వహిస్తున్నా రు. వీరు డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని ప్రధాన, ఉప కాలువలకు నీరు విడుదల చేయడంతోపాటు జలాశయాన్ని, కాలువలను పర్యవేక్షి స్తుంటారు. వారికి 18 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. అలాగే జలాశయాల నిర్వహణ నిధులు కూడా మంజూరు చేయక పోవడంతో వారికి వేతనాలు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. గతంలో పని చేసిన లస్కర్లకు సైతం వేతనాలు చెల్లించకపోవడంతో వారు కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి వేతనాలు చెల్లిం చాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ అంకులయ్యను వివరణ కోరగా లస్కర్ల వేతనాలకు సంబంధించిన నివేదిక విజయవాడలోని ఉన్నతాధికారులకు పంపాం, బడ్జెట్‌ విడుదల కాగానే వేతనాలు చెల్లిస్తామని  తెలిపారు.