కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం

ABN , First Publish Date - 2022-06-26T15:13:03+05:30 IST

కారు వెనక్కి తీస్తుండగా ఆడుకుంటూ వచ్చిన 18 నెలల బాలుడు టైరు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి

కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం

టైరు కింద నలిగి 18 నెలల బాలుడి మృతి

హైదరాబాద్/నిజాంపేట్‌: కారు వెనక్కి తీస్తుండగా ఆడుకుంటూ వచ్చిన 18 నెలల బాలుడు టైరు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్‌, జ్యోతి దంపతులు నిజాంపేట్‌, శివసాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి హర్షవర్ధన్‌ (18 నెలలు) కుమారుడు. వారి ఇంటి సమీపంలోని సాయిబాబా ఆలయంలో వీర అశ్విత్‌ పూజారి. శుక్రవారం రాత్రి అశ్విత్‌ తన కారును వెనక్కి తీస్తుండగా ఆడుకుంటూ వచ్చిన హర్షవర్ధన్‌ వెనుకటైరు కింద పడ్డాడు. తీవ్రగాయాలైన చిన్నారిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడినుంచి కూకట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడు మృతిచెందాడు. బాలుడి తండ్రి నరేష్‌ శనివారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2022-06-26T15:13:03+05:30 IST