Abn logo
Feb 21 2020 @ 16:38PM

18 అడుగుల భారీ శివలింగం.. ఎక్కడో తెలుసా?

నెల్లూరు: నగరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏటా మహాశివరాత్రి రోజున విభిన్న శివలింగాలను ఏర్పాటు చేసి.. అందరూ సన్మార్గంలో నడుచుకోవాలని ప్రచారం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. నగరవాసులు శివలింగాన్ని చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. 18 అనే సంఖ్యకు చాలా విశిష్టతలు ఉన్నాయని మహా భారతంలో కూడా పద్దెనిమిది పర్వాలు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే అయ్యప్ప ఆలయంలోనూ 18 పడిమెట్లు ఉంటాయని చెబుతున్నారు. అందుకే 18 అడుగుల ఎత్తులో భారీ శివలింగం ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement