ఢిల్లీ ఘర్షణ: ఆసుపత్రిలో 18 మంది పోలీసులు

ABN , First Publish Date - 2021-01-27T01:59:15+05:30 IST

ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను రైతులు ఉల్లంఘించారు. సరిహద్దులు దాటి దేశ రాజధాని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించారు. అయితే రైతులు నిబంధనలు ఉల్లంఘించి

ఢిల్లీ ఘర్షణ: ఆసుపత్రిలో 18 మంది పోలీసులు

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో మంగళవారం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఘర్షణగా మారింది. రైతులకు పోలీసులకు మధ్య అక్కడక్కడా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. అయితే ఈ ఘర్షణలో 18 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో నగరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు బలగాలను దింపుతోంది.


ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను రైతులు ఉల్లంఘించారు. సరిహద్దులు దాటి దేశ రాజధాని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించారు. అయితే రైతులు నిబంధనలు ఉల్లంఘించి, చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం, శాంతి పాటించాలని, పోలీసులపై దాడి, విధ్వంసం సృష్టించవద్దని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి అదుపుతప్పడంతో ఢిల్లీలోని రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రైతులు బారికేడ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పాటు ట్రాక్టర్లతో సిమెంటు దిమ్మలను తొలగించే ప్రయత్నం చేశారు. 


ఐటీఓ వద్ద రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న క్రమంలోనే ఒక గ్రూపు ఎర్రకోట వైపు దూసుకువెళ్లింది. ‘ట్రాక్టర్ ర్యాలీ'తో రైతులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట చేరిన రైతు ఆందోళనకారులు ఎర్రకోట బురుజులపై జెండాలు ఊపుతూ హడావిడి చేశారు. అనంతరం ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండాను ఎగరవేశారు.

Updated Date - 2021-01-27T01:59:15+05:30 IST