Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 21 Sep 2021 19:11:21 IST

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో బగ్‌ను గుర్తించిన టీనేజర్

twitter-iconwatsapp-iconfb-icon

ముంబై: చెన్నైకి చెందిన రంగనాథన్ అనే టీనేజర్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టికెటింగ్ పోర్టల్‌లో బగ్‌ను కనిపెట్టడంతో ఆ సంస్థ వెంటనే సరిదిద్దింది. ఆగంతకుల చేతికి ఈ సమాచారం చిక్కితే దుర్వినియోగమయ్యే అవకాశం ఉండటంతో ఆ టీనేజర్ వెంటనే ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేయడంతో వారు ఆ బగ్‌ను సరిచేశారు. పి.రంగనాథన్ వయసు 17 ఏళ్లు. చెన్నైలోని తాంబరంలో 12వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ అయ్యి టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే వెబ్‌సైట్‌లో భద్రత పరమైన సమస్యలు ఉన్నాయని గుర్తించాడు. ప్రయాణికులకు సంబంధించిన పేరు, వయసు, రైలు ప్రయాణం వివరాలు, పీఏన్‌ఆర్ నంబర్, గమ్యస్థానం మొదలైనవి రంగనాథన్ తెలుసుకున్నాడు. ప్రయాణికులకు తెలియకుండానే వారి టిక్కెట్టును ఒక హ్యాకర్ రద్దు చేయగలడని గుర్తించాడు. ఫలితంగా ఆ టీనేజర్ ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేయడంతో వారు ఆ బగ్‌ను సరిదిద్దారు.


‘‘ ప్రయాణికులకు తెలియకుండానే హ్యాకర్ వారి పేరు మీద ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవచ్చు. టిక్కెట్టును కూడా రద్దు చేయవచ్చు. బస్ టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లను కూడా మార్చవచ్చు’’ అని అతడు ఒక పత్రికకు తెలిపాడు. గత ఆగస్టు 30న పోర్టల్‌లో ఉన్న బగ్‌ల గురించి ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్(సెర్ట్)కు సమాచారం అందిస్తే వారు వెంటనే ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేశారు. ఐఆర్‌సీటీసీ అధికారులు ఐదు రోజుల అనంతరం ఈ బగ్‌ను సరిదిద్దారు. 









Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.