నెలలు నిండకుండానే ప్రసవం .. ఎలాంటి బిడ్డ పుట్టిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-12T02:54:23+05:30 IST

యుక్తవయసు రాకుండానే గర్భం దాలిస్తే ఎటువంటి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయో తెలిపే ఘటన ఇది.

నెలలు నిండకుండానే ప్రసవం .. ఎలాంటి బిడ్డ పుట్టిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ వయసులో గర్భం దాలిస్తే ఎటువంటి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయో తెలిపే ఘటన ఇది. బ్రిటన్‌కు చెందిన ఎల్లీ 17 ఏళ్లకే గర్భం దాల్చింది. దీనికి తోడు.. ఏడో నెలలోనే డెలివరీ జరిగింది. ఈ క్రమంలో కేవలం 325 గ్రాముల బరువున్న శిశువు జన్మించింది. గతేడాది డిసెంబర్ 30న ఆమె ప్రసవించింది. శిశువు బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ బిడ్డ క్రమంగా కోలుకుని ప్రస్తుతం తనంతట తానుగా శ్వాసతీసుకునే స్థితికి చేరుకుంది.  అయితే.. బ్రిటన్‌లో ఇంత తక్కువ బరువున్న శిశువు జన్మించడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. 


సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు దాదాపు 2.5 కిలోలు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క! అయితే.. ఎల్లీ బిడ్డ బరువు ఇంత తక్కువగా ఉండటంతో వైద్యులు ఆందోళన చెందారు. ఇక..కడుపుతో ఉండగానే ఎల్లీలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆమె రక్తపోటులో ఎగుడుదిగులో చోటు చేసుకోవడంలో వైద్యులు కంగారు పడిపోయారు. ఓ రోజు అకస్మాత్తుగా ఎల్లీ గుండెలో నొప్పి రావడంతో వైద్యులు అత్యవసరంగా సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడంతో శిశువు బతకడం దాదాపు అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే.. బిడ్డ క్రమంగా శక్తి పుంజుకుంటూ ఎల్లీ, ఆమె భాగస్వామిలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. 

Updated Date - 2022-01-12T02:54:23+05:30 IST