తండ్రిని పొట్టనపెట్టుకుని..క్రైమ్ పాట్రోల్‌‌ను 100 సార్లు చూసి..ఆర్థరాత్రి ఇలా..

ABN , First Publish Date - 2020-10-30T02:56:41+05:30 IST

తండ్రితో ఓ టీనేజ్ కుర్రాడి వాగ్వివాదం. ఓ విషయంలో కుమారుడు తప్పు చేసినందుకు తండ్రి కోపడ్డాడు. ఇది కుటుంబసభ్యుల మధ్య అప్పుడప్పుడూ చోటుచేసుకునే వివాదామే. కానీ..ఈ తండ్రి కొడుకుల విషయంలో మాత్రం ఈ వాగ్వివాదం ఊహించని మలుపు తిరిగింది.

తండ్రిని పొట్టనపెట్టుకుని..క్రైమ్ పాట్రోల్‌‌ను 100 సార్లు చూసి..ఆర్థరాత్రి ఇలా..

లక్నో: తండ్రితో ఓ టీనేజ్ కుర్రాడి వాగ్వివాదం. ఓ విషయంలో కుమారుడు తప్పు చేసినందుకు తండ్రి కోపడ్డాడు. ఇది కుటుంబసభ్యుల మధ్య అప్పుడప్పుడూ చోటుచేసుకునే వివాదామే. కానీ..ఈ తండ్రీకొడుకుల విషయంలో మాత్రం ఈ వాగ్వివాదం ఊహించని మలుపు తిరిగింది. తండ్రి తనపై కోప్పడటాన్ని సహించలేకపోయిన ఆ కుమారుడు కన్న తండ్రిపైనే తిరగబడ్డాడు. కోపంలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తండ్రిని హత్య చేశాడు. తండ్రి నెత్తిపై ఇనుప రాడ్డుతో కొట్టి..ఆ తరువాత ఓ వస్త్రాన్ని గొంతు చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. తండ్రి పోయిన కొంత సేపటికి కానీ ఆ ఉన్మాదం నుంచి అతడు బయటపడలేకపోయాడు.. జరిగిన ఘోరాన్ని గుర్తించలేకపోయాడు. 


ఈ హత్య మే 2న జరిగింది. మృతుడి పేరు మనోజ్ మిశ్రా. ఉత్తరప్రదేశ్‌లో మథురలో నివసిస్తుంటాడు. అతడు ఇస్కాన్ సంస్థ‌లో విరాళాలు సేకరించే పని చేస్తుంటాడు. అయితే..ఇన్నాళ్లుగా మనోజ్ కనిపించకపోవడంతో అతడి సహోద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో వారికి ఏదో సర్ధి చెప్పి పంపించిన తల్లి కొడుకులు చివరకు మే 27న కేసు నమోదు చేశారు. అయితే..విచారణకు ఎప్పుడు పిలిచినా కుమారుడు దాట వేసేవాడు. ఏ చట్టం కింద నన్ను విచారిస్తారు అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించే వాడు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. అతడి ఫోన్ తీసుకుని పరిశీలిస్తే..క్రైమ్ పాట్రోల్ వీక్షించిన విషయం బయటపడింది. దీంతో వారు నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించగా..అతడు తన తండ్రిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో బుధవారం నాడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. 


ఆ తరువాత..ఈ దారుణానికి సంబంధించి రెండో అంకం ప్రారంభమైంది. తండ్రి చనిపోయాడని గుర్తించిన అతడు వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెప్పి సహాయం కోరాడు. దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాడు. చివరకు మృత దేహాన్ని మాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. మరి ఇది ఎలా చేయాలి...అప్పటికి అతడేమీ క్రిమినల్ కాదు కదా..? దీంతో అతడు ఐడియాల కోసం టీవీలో ప్రసారమయ్యే క్రైమ్ పాట్రోల్ సీరీస్‌ను మెబైల్‌లో చూశాడు. అన్ని ఎపిసోడ్లను ఆసాంతం తిలకించాడు. దాదాపు 100 సార్లు ఈ సీరిస్‌ను చూసి పక్కగా ప్లాన్ చేసుకున్నాడు. హత్య జిరిగిన రోజు రాత్రే తండ్రి మృతదేహాన్ని తల్లి సహాయంతో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించాడు. అక్కడ పెట్రోల్ పోసి మృత దేహాన్ని తగలబెట్టాడు. 

Updated Date - 2020-10-30T02:56:41+05:30 IST