Kuwait: జనవరిలో ఎంతమంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిందంటే..?

ABN , First Publish Date - 2022-02-02T17:15:12+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Kuwait: జనవరిలో ఎంతమంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిందంటే..?

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తినిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా జనవరిలో ఏకంగా 1,764 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశం నుంచి బహిష్కరణకు గురైన మొత్తం 1,764 మందిలో 1,058 మంది పురుషులు, 706 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ వివిధ చట్టాలను ఉల్లంఘించడంతో ఖైదు చేయబడిన వారు అని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణలు అమలు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. 

Updated Date - 2022-02-02T17:15:12+05:30 IST