ఢిల్లీ అల్లర్ల కేసులో 17,000 పేజీల ఛార్జ్‌షీట్.. లిస్టంతా వారి పేర్లే

ABN , First Publish Date - 2020-09-17T01:05:26+05:30 IST

పార్టీ సస్పెండ్ చేసిన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సహా పలువురు విద్యార్థుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని, మరికొంత మంది నిందితులపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ అల్లర్ల కేసులో 17,000 పేజీల ఛార్జ్‌షీట్.. లిస్టంతా వారి పేర్లే

న్యూఢిల్లీ: ఫిభ్రవరిలో దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్ల కేసులో 17,000 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీటులో 15 మంది పేర్కొన్నారు. అయితే వీరంతా పలు సందర్భాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకుండా సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసన పట్ల సానుభూతి ఉన్నవారు కావడం గమనార్హం. రెండు ఇనుప పెట్టేలో ఫైల్ కాపీలను తరలించారు.


2,600 పేజీలకు పైగా నిందితులపై అభియోగాలనే ప్రస్తావించారు. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఛార్జ్‌షీటులో ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసిన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సహా పలువురు విద్యార్థుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని, మరికొంత మంది నిందితులపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


‘‘ప్రస్తుత అనుమానితులు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు సృష్టించిన వారితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నిరసన (షహీన్‌బాగ్ నిరసన) ప్రారంభమైనప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. నిరసన మొదలైన తొలినాళ్లలోనే వివాదస్పదమైంది. రోడ్లు బ్లాక్ చేయడం, ట్రాఫిక్ జామ్‌కు కారణం అవడం లాంటి ప్రజాస్వామ్య విరుద్ధం. గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆ నిరసన చేపట్టారు’’ అని కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-17T01:05:26+05:30 IST