దుబాయి నుంచి భారత్‌కు చేరిన 173 మంది!

ABN , First Publish Date - 2020-07-16T04:13:11+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రి

దుబాయి నుంచి భారత్‌కు చేరిన 173 మంది!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా 175 మందితో దుబాయ్‌ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం.. మంగళవారం రోజు చండీగఢ్‌‌లో ల్యాండ్ అయింది. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా.. వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికా, న్యూజిలాండ్, కువైట్, షార్జా, దుబాయ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2వేల మంది భారతీయులు చండీగఢ్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు భారత ప్రభుత్వం.. మే 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ప్రస్తుతం నాలుగో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. 


Updated Date - 2020-07-16T04:13:11+05:30 IST