ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 171 మంది పిల్లలు

ABN , First Publish Date - 2021-09-05T23:39:38+05:30 IST

సీజనల్‌గా వచ్చే వ్యాధులు, వైరల్ ఫీవర్‌ ఉత్తరప్రదేశ్‌ను బెంబేలెత్తిస్తున్న పరిస్థితి..

ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 171 మంది పిల్లలు

ప్రయాగ్‌రాజ్: సీజనల్‌గా వచ్చే వ్యాధులు, వైరల్ ఫీవర్‌ ఉత్తరప్రదేశ్‌ను బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 170 మందికి పైగా పిల్లలతో ప్రయాగరాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. దీనిపై ప్రయాగ్ రాజ్ సీఎంఓ డాక్టర్ నానక్ శరణ్ మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితం తాను పిల్లల వార్డు తనిఖీ చేశానని, 120 పడకలు ఉండగా, 171 మంది పేషెంట్లు వచ్చారని, దీంతో ఇద్దరు ముగ్గుర్ని ఒకే బెడ్‌పై షిప్ట్ చేశామని చెప్పారు. డెంగ్యూ, జర్వం కేసులే ఎక్కువని, కొందరు ఎన్సెఫలిటిస్, న్యుమోనియాతో బాధపడుతున్నారని, ఆక్సిజన్ సపోర్ట్ అవసరమున్నందున వారు ఇక్కడ అడ్మిట్ అయ్యారని తెలిపారు. 200 పడకల వార్డు నిర్మాణంలో ఉందని, పిల్లల స్వస్థత కోసం చేయగలిగినదంతా చేస్తున్నామని చెప్పారు.


కాగా, మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై ముగ్గురు నుంచి నలుగురు పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని, నేలమీద చాపలు పరిచి మరికొందరికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. అత్యవసర ట్రీట్‌మెంట్ అవసరమైన పిల్లలు చాలా మంది ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆసుపత్రిలో చేరిన ఓ పిల్లవాడి తండ్రి వాపోయాడు.

Updated Date - 2021-09-05T23:39:38+05:30 IST