New Delhi : భారత్(India)లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,070 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 23 మంది మరణించారు. 14,413 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,07,189 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 197.74 కోట్ల కొవిడ్ టీకాలను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.