Triangle Love Story: అమ్మాయి కోసం దారుణం.. ఏకంగా తలనరికి..

ABN , First Publish Date - 2021-08-04T08:26:26+05:30 IST

అమ్మాయి కోసం 17 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ మాయలో పడి కటకటాల

Triangle Love Story: అమ్మాయి కోసం దారుణం.. ఏకంగా తలనరికి..

చెన్నై: అమ్మాయి కోసం 17 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ మాయలో పడి కటకటాలపాలయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయినే తన స్నేహితుడు కూడా ప్రేమిస్తుండడంతో అతడికి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే స్నేహితుడిని కిరాతకంగా చంపి అతడి మొండెం నుంచి తలను వేరు చేసి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని ట్యూటికోరన్ జిల్లాలో సంచలనంగా మారింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన వ్యక్తి పీ మదన్‌కుమార్(22)గా గుర్తించారు. గత నెల 29 గురువారం నుంచి అతడు కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం మంతితోపు ప్రాంతంలో అతడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మొండెం నుంచి తలను వేరు చేసి అత్యంత కిరాతకంగా అతడిని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. మదన్ కుమార్ స్థానిక స్టాలిన్ కాలనీలోని కోవిల్ పట్టి ప్రాంతంలో నివశించేవాడు. అతడు పెయింటర్‌గా పనిచేసేవాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


అనంతరం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా 17ఏళ్ల బాలుడిని నిందితుడిగా గుర్తించారు. మదన్‌కుమార్‌తో పాటు పెయింటర్‌గా పనిచేసే బాలుడే ఈ హత్య చేసినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ 8వ తరగతితో చదువు ఆపేసిన ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఇష్టపడ్డారని, ఆ ప్రేమ వ్యవహారంలోనే వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. మరో ట్విస్ట్ ఏంటంటే సదరు యువతి ఇద్దరితోనూ మొబైల్‌లో చాట్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మదన్‌కుమార్‌నే ఎక్కువగా ఇష్టపడేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మదన్ కుమార్ తన ప్రేమకు అడ్డుగా మారతాడనే కోపంలో నిందితుడు అతడిని దారుణంగా హతమార్చాడు.

Updated Date - 2021-08-04T08:26:26+05:30 IST