17 రూట్లలో మళ్లీ City బస్సులు

ABN , First Publish Date - 2021-10-27T13:29:08+05:30 IST

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నగర శివారు ప్రాంతాల వైపు 17 రూట్లలో నిలిపివేసిన సిటీ బస్‌ సర్వీసులను రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ మంగళవారం ఉదయం ప్రారంభించారు. క్రోంపేట బస్‌స్టేషన్‌లో ఏర్పాటైన

17 రూట్లలో మళ్లీ City బస్సులు

                            - ప్రారంభించిన మంత్రి రాజకన్నప్పన్‌


చెన్నై(Tamilnadu): అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నగర శివారు ప్రాంతాల వైపు 17 రూట్లలో నిలిపివేసిన సిటీ బస్‌ సర్వీసులను రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ మంగళవారం ఉదయం ప్రారంభించారు. క్రోంపేట బస్‌స్టేషన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో క్రోంపేట, నంగనల్లూరు, కుండ్రత్తూరు, కీళ్‌కట్టలై, పోయిచ్చలూరు, మాంగాడు ప్రాంతాలకు ఈ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఎం 52 నెంబర్‌, పోయిచ్చలూరు - కాయరాంబేడు సిటీ బస్‌, 570డి నెంబర్‌ తాళంబూరు - కోయంబేడు బస్సు, 523 నెంబర్‌ తిరువాన్మియూరు- ముల్లివాక్కం బస్‌, ఎస్‌ 81 నెంబర్‌ క్రోంపేట - పోయిచ్చలూరు మినీ బస్‌, 154బీ నంగనల్లూరు - పూందమల్లి బస్‌, 52 సీ నెంబర్‌ హస్తినాపురం -టి.నగర్‌ బస్‌, 70 హెచ్‌ నెంబర్‌ హస్తినాపురం - కోయంబేడు బస్‌, 552కే నెంబర్‌ కీళ్‌కట్టలై - తిరుప్పోరూరు బస్‌, 60ఏ నెంబర్‌ బ్రాడ్వే,- కుండ్రత్తూరు బస్‌, 53 నెంబర్‌ బ్రాడ్వే - మాంగాడు - కుండ్రత్తూరు బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ మంత్రి దోమా అన్బరసన్‌, పల్లావరం శాసనసభ్యుడు ఇ.కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T13:29:08+05:30 IST